ఏడు నెలల జీతాలు చెల్లించాలి: సిఐటియు

72చూసినవారు
ఏడు నెలల జీతాలు చెల్లించాలి: సిఐటియు
గ్రామ సమాఖ్యలో పనిచేస్తున్న అనిమేటర్లకు ఫిబ్రవరి నుండి ఏడు నెలలు జీతాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్ కోరారు. మంగళవారం రైల్వే కోడూరు సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలలో సమర్థవంతంగా పనిచేస్తున్న వివోఏలకు జీతాలు లేకుంటే జీవనం ఎలా అని ప్రశ్నించారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా నేటికీ సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్