రాజంపేటలోని మహాత్మ గాంధీ విగ్రహానికి బుధవారం అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురాం రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ అని కొనియాడారు. శాంతి, అహింస పద్ధతిలో దేశానికి మహాత్ముడు స్వాతంత్రం తీసుకొచ్చారని కొనియాడారు. భావితరాలు కూడా గాంధీ మార్గంలో పయనించాలని ప్రెస్ క్లబ్ కార్యదర్శి శివ అన్నారు.