సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లిలో రెవిన్యూ సదస్సు శుక్రవారం.. గ్రామ సర్పంచ్ తొర్ర చిన్నక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. మందపల్లె గ్రామ పొలాలు ఉద్దిమడుగు కారణంగా భూములు కోల్పోవడం జరిగిందని, వాటికి నష్ట పరిహారం చెల్లించకుండా భూములు ఆన్లైన్ తొలగించడం జరిగిందని మందపల్లి గ్రామ రైతులు ఎమ్మార్వో దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు.