అన్నమయ్య జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేటర్ హాలులో "ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం, పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.