పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
చిన్నమండెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది, పాఠశాలకు హాజరైన వారు ఎంతమంది అని ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో రోజువారి అమలు చేస్తున్న మెనూ వివరాలను, పాఠ్యాంశాల ప్రణాళికలు, టాయిలెట్స్ నిర్వహణపై పాఠశాల హెడ్మాస్టర్ రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.