వైభవంగా దిగువ గిండి గంగమ్మ జాతర

68చూసినవారు
వైభవంగా దిగువ గిండి గంగమ్మ జాతర
ఉప్పులూరి వాండ్లపల్లెకు సమీపంలో వెలసిన దిగువ గిండి గంగమ్మ జాతరను గ్రామస్థులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రభాకర్, వెంకటేశ్ ఉదయమే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. గ్రామ మహిళలంతా కలసి సామూహికంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి దీలుబోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్