పాల వ్యాను ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నక్కల దీన్నే తండాకు చెందిన చెక్రి నాయక్ శుక్రవారం రాయచోటి పెద్ద బిడికిలోని తన సోదరుడి వివాహానికి హాజరయ్యాడు. తిరిగి వస్తున్న క్రమంలో ముదివేడు టోల్ ప్లాజా వద్దకు రాగానే.. పాల వ్యాను ఇతని బైకును ఢీకొట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ఆయన వివరించారు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు.