తంబళ్లపల్లి: బాలికల పట్ల మతిస్థిమితం లేని వ్యక్తి అసభ్య ప్రవర్తన
తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట, బీసీ కాలనీలో సోమవారం బాలికల పట్ల మతిస్థిమితం లేని వ్యక్తి అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. బాలికలు కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మతిస్థిమితం లేని వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలానికి ముదివేది ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. ఘటన గల కారణాలను స్థానికులను అడిగి ఆరా తీశారు. వివరాలు తెలియాల్సి ఉంది.