AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీ కానుంది. మ.3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.