కేవలం గంటన్నరలోనే ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. గురువారం సా.5:30 గంటలకు హైదరాబాద్‌లోని హుమాయున్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు (2, 3 ఏళ్ల వయసు) అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల్ని పోలీసులు ఆశ్రయించగా వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. సీసీటీవీ కెమెరాల పరిశీలించి ఇద్దరు చిన్నారుల ఆచూకీ కనుగొన్నారు. గంటన్నరలోనే పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.