దేశ ప్రధాని నరేంద్ర మోదికి మరో పురస్కారం దక్కింది. కొవిడ్ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వం, విలువైన సాయానికి గుర్తింపుగా బార్బడోస్ గతేడాది ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ తరఫున అవార్డును విదేశాంగశాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా అందుకున్నారు.