రసాయనిక ఎరువులు వాడి భూమిని విషతుల్యం చేయవద్దని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.