ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్. పి. అరుణ్ బాబు ఎడ్లపాడు మండలం సందెపూడి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.