వాడరేవులో ఘనంగా సాగరానికి హారతి

57చూసినవారు
వాడరేవులో ఘనంగా సాగరానికి హారతి
పౌర్ణమిని పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం రాత్రి వాడరేవుల్లో సాగర హారతి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ విచ్చేసి స్పటిక శివలింగానికి పంచామృతాభిషేకం నిర్వహించి తదుపరి సాగరానికి హారతి ఇచ్చారు. స్థానిక అర్చక పండితులు కారంచేటి నగేష్ కుమార్, కార్తీక్ శర్మ పూజాదికాలు నిర్వహించారు. తాడివలస దేవరాజు, బండారు జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్