చీరాల: మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టుల నిరసన

66చూసినవారు
చీరాల: మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టుల నిరసన
జర్నలిస్టులపై దాడికి తెగబడిన సినీనటుడు మోహన్‌బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాలలో జర్నలిస్టులు గురువారం నిరసన ప్రదర్సన చేపట్టారు. టివి 9 రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే మీడియాపై దాడి గర్హనీయమన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న మోహన్ బాబును శిక్షించాలని డిఎస్పి మొయిన్ ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్