చినగంజాం: పోలింగ్ కేంద్రాలు సందర్శించిన చీరాల ఆర్డీవో

63చూసినవారు
చినగంజాం: పోలింగ్ కేంద్రాలు సందర్శించిన చీరాల ఆర్డీవో
చినగంజాం మండలం కడవకుదురు, పెదగంజాం గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు శనివారం సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. చినగంజాం తహసిల్దార్ ప్రభాకరరావు, వీఆర్వోలు ఆర్డీవో వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్