గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చే బాధితుల కోసం భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అక్షయపాత్ర సహకారంతో అర్జీదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత మరోసారి గుంటూరులో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. పేర్లు నమోదు చేసుకున్న అర్జీదారులకు టోకెన్లు ఇచ్చి భోజనాలు పెడుతున్నారు. కలెక్టర్ నిర్ణయం పట్ల ప్రజల హర్షం వ్యక్తం చేశారు