మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడు గ్రామంలో శుక్రవారం కౌలు దారుని హక్కు పత్రాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సతీష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పొలం కౌలుకు చేసే ప్రతి ఒక్క రైతు రెవెన్యూ శాఖ వారు జారీ చేసే పంట సాగు హక్కు కార్డు పొందాలని సూచించారు. కౌలు రైతుకార్డు వలన పండించిన పంటకు పంటకు మద్దతు ధరకు అమ్ముకునే వీలు ఉంటుందన్నారు.