మాచవరం మండలం తాడుట్ల గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించిన సొసైటీ భూములను అగ్రకుల పెత్తందారులు నుండి కాపాడాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మొర్జంపాడు సచివాలయం వద్ద రెవెన్యూ భూ సదస్సులో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. గోవిందాపురం తాడుట్ల గ్రామం పేదలకు చెందిన 44 ఎకరాల సొసైటీ భూములను అగ్రకుల భూస్వాములు ఆక్రమించారని ఆరోపించారు. నకిలీ పాస్ పుస్తకాలు చూపుతున్నారని అన్నారు.