రెంటచింతల: చెత్తను వెంటనే తొలగించండి

72చూసినవారు
రెంటచింతల: చెత్తను వెంటనే తొలగించండి
సకాలంలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన రెంటచింతల మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వామి మాన్యంలో చెత్తను సేకరించకుండా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు అని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చెత్తను యార్డ్కు తరలించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్