ప్రమాద బీమాతో ఆయా కుటుంబాలకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని శుక్రవారం యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మాధురి అన్నారు. నకరికల్లు, దేచవరం గ్రామాలకు చెందిన మరియా బాబు, అంజిరెడ్డి ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. ప్రమాద బీమా పాలసీ క్రింద వారి కుటుంబ సభ్యులకు ఒకరికి రూ. 4 లక్షలు, ఇంకొకరికి రూ. 2 లక్షల చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ భాస్కరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.