మాచర్ల మండలం నాగార్జున సాగర్ 18 క్రస్ట్ గేట్ల నుంచి ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు 1. 72 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ప్లే వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై శనివారం రాత్రి నుంచి 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,45,422 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 80 అడుగులుగా ఉంది.