దెబ్బతిన్న చేనేత మగ్గాలను పరిశీలించిన కేంద్ర బృందం

83చూసినవారు
దెబ్బతిన్న చేనేత మగ్గాలను పరిశీలించిన కేంద్ర బృందం
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను గురువారం ముగ్గురు సభ్యులు గల కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాల వలన ప్రతిఏటా జరిగిన నష్టాన్ని వారికి వివరించారు. గుంట మగ్గాలకు బదులుగా స్టాండ్ మగ్గాలను ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్