వరదల ప్రభావం, వినాయక చవితి ఏర్పాట్ల పై పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని గ్రామాల్లో పరిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని, చవితికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం విగ్రహాలు అమరావతికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.