పొన్నూరు: విద్యా సంస్కరణలకు ఆధ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే

53చూసినవారు
విద్యాసంస్కరణలకు, స్త్రీల విద్యకు, సంఘసంస్కరణలకు ఆధ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని పొన్నూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. పొన్నూరు పట్టణంలోని వైసిపి కార్యాలయంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 134 వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబటి పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్