తెనాలి పట్టణంలోని గాంధీ ఇర్విన్ పార్క్ రైతు బజార్ ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాత రత్న టాకీస్ సమీపంలోని రహదారి విస్తరణ పనులు పరిశీలించేందుకు ఉదయం వచ్చిన మనోహర్ రైతు బజార్లోకి వెళ్లి అక్కడ తనిఖీలు చేశారు. రైతు బజార్ లో విక్రయిస్తున్న బియ్యం, కూరగాయల ధరలు, నాణ్యతను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.