తెనాలి: ఇంట్లో బంగారం మాయంపై పోలీసులకు ఫిర్యాదు
ఇంట్లో బంగారం మాయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలిలోని నందులపేటలోని ఓ ఇంట్లో ఈ ఏడాది జులైలో వ్రతం ఆచరించి బంధువులను పిలుచుకున్నారు. అందరూ వెళ్లిపోయిన తరవాత ఇంటిలో ఉండాల్సిన రూ. 2లక్షల విలువైన బంగారు ఆభరణాల పెట్టె కనిపించలేదు. దీంతో పలుమార్లు వ్రతానికి హాజరైన వారితో మాట్లాడిన తర్వాత వారు తెనాలి 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు.