ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నేటి నుండి జనవరి 8 వ తేదీ వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసిల్దార్, కూచిపూడి నెహ్రూ బాబు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కోరుతాడిపర్రు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ భూములకు సంబంధించి దీర్ఘకాలికముగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను 10 మంది రైతులు అర్జీల ద్వారా సమర్పించారు.