నూజెండ్ల: నీటి సంఘం ఎన్నికల్లో ఘర్షణ.. గాయాలు

58చూసినవారు
నూజెండ్ల మండలంలో నీటి సంఘం ఎన్నికలు శనివారం ఘర్షణకు దారితీశాయి. కంభంపాడు నీటి సంఘం ఎన్నికల సందర్భంగా సభ్యులు నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించే సందర్భంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న ఎస్ఐ బీవీ. కృష్ణారావు తన సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకుని ఘర్షణ నివారించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్