AP: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు మరో షాక్ తగిలింది. నరసరావుపేట కోర్టు అనిల్ కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను నరసరావుపేట కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. ఫిరంగిపురం పీఎస్ లో బోరుగడ్డపై నమోదైన కేసు విషయంలో పీటి వారెంట్ పై నరసరావుపేట కోర్టుకు పోలీసులు తీసుకునివచ్చారు. ఈ కేసులో వచ్చే నెల 4వ తేదీ వరకూ అనిల్ కు జడ్జి రిమాండ్ విధించారు.