పుత్తూరు: ఇళ్లల్లోకి చొరబడుతున్న పాములు
నగిరి నియోజకవర్గంలోని పుత్తూరు పట్టణంలో ఓ ఇంట్లోని బాత్రూంలో మంగళవారం నాగుపాము దూరింది. దీంతో ఇంట్లో వారు భయపడి స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న శ్రీకాంత్ పామును చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా పుత్తూరు పరిసర ప్రాంతాల్లో కొండచిలువలు, జెర్రిపోతులు, ఇళ్లలోకి దూరి హల్చల్ చేస్తున్నాయి.