చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పుంగమ్మ చెరువు, రాయల చెరువులకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో. మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని కోనేరు వద్ద నుంచి చంగలాపురం వరకు వంకలో పూడికతీత పనులు చేపట్టారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు హిటాచీ తో పూడికతీత పనులు నిర్వహించారు.