చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి దేవి వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారి దగ్గర విశేష పూజలను నిర్వహించారు. ఈ పూజలో భాగంగా మహిళా భక్తులకు ఆలయ పండితులు అమ్మవారి తోరణాలను అందజేశారు.