వరదయ్యపాళెం: శ్రీసిటీలో అతివేగం వల్లే ప్రమాదం
డ్రైవరు వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిందని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండల శ్రీసిటీ ఎస్ఐ హరిప్రసాద్ ఆదివారం చెప్పారు. మృతులు డ్రైవర్ అజయ్ రామ్ (42), మనోజ్ సింగ్ (52) బీహార్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించినట్లు తెలిపారు. తడలో నడుస్తున్న కార్ క్యాటరింగ్ సేవల్లో పనిచేస్తున్నారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ పేర్కొన్నారు.