నాగలాపురం: ఆలయాలలో భక్తుల రద్దీ
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలోని హరికంటేశ్వరాలయం, సురుటుపల్లి పల్లికొండేశ్వరాలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలను నిర్వహించారు. ఆలయాల్లోని మూలవర్లకు అభిషేకాలు చేసి సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.