చిత్తూరు మండలంలో ఆదివారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా గువ్వకల్లు వద్ద ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 6,400 స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. నిందితులు లక్ష్మణ కుమార్, భాను ప్రకాశ్, మురుగయ్య, కాసిం సాహెబ్, మానవకన్, రాజేంద్రపై కేసు నమోదు చేశామన్నారు. మండంలలో చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.