తమిళనాడు నుండి కుప్పం మీదుగా కర్నాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న తమిళ రేషన్ బియ్యం వాహనాన్ని కుప్పం పోలీసులు ఆదివారం సీజ్ చేసి స్టేషన్ వద్దకు తరలించారు. టెంపో వాహనంలో సుమారు 60 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.