మదనపల్లి: ప్రభుత్వాసుపత్రి ప్రైవేటుపరం కాకుండా దీక్ష

77చూసినవారు
మదనపల్లి: ప్రభుత్వాసుపత్రి ప్రైవేటుపరం కాకుండా దీక్ష
మదనపల్లి సర్వజన బోధనాసుపత్రి ప్రైవేటుపరం కాకుండా పరిరక్షణకు సామూహిక దీక్షలకు పూనుకుంటున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. బోధనాసుపత్రిని ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని.. సామూహిక దీక్షల గోడ పత్రాలను ఆదివారం విడుదల చేశారు. వంద ఏళ్లుగా పేదలకు ఉచిత వైద్యం అందించిన ఆసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్