మదనపల్లె: నాటు సారా తరలిస్తున్న మహిళ అరెస్ట్

54చూసినవారు
మదనపల్లె: నాటు సారా తరలిస్తున్న మహిళ అరెస్ట్
నాటు సార తరలిస్తున్న మహిళను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ భీమలింగ తెలిపారు. మదనపల్లె బసినికొండకు చెందిన ఓ మహిళ పుంగనూరు రోడ్డులో 40లీ. సారాను సంచిలో వేసుకొని ఇంటికి వస్తుండగా,  నిందితురాలని ఎస్సైలు జబీఉల్లా, డార్కస్ తదితరులతో కలిసి అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు. ఆమెకు సార సరఫరా చేసిన మంగు నాయక్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్