సిద్ధిరాజుకండ్రిగలో ఘనంగా సంకటహర చతుర్ధి పూజలు

79చూసినవారు
సిద్ధిరాజుకండ్రిగలో ఘనంగా సంకటహర చతుర్ధి పూజలు
పిచ్చాటూరు మండలం, సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ గణపతి హనుమతేశ్వర దేవస్థానము నందు శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారికి ఆదివారం సాయంత్రం సంకటహర చతుర్ధి సందర్భంగా విశేష అభిషేకము జరిపారు. అనంతరం స్వామివారికి మోదకాలు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించారు. భజన గురువులు లోకేష్ దాస్, శివకుమార్ దాస్, తులసీదాస్ వారిచే వైభవంగా భజన కార్యక్రమం నిర్వర్తించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్