నగరి నియోజకవర్గం కూనమరాజుపాళెంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం సాయంత్రం గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారికి నైవేద్యంగా పొంగళ్ళు సమర్పించారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ మరుసటి రోజు అమ్మవారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో పంటలు సమృద్ధిగా పండాలని రైతులు అమ్మవారిని కొలిచారు. అనంతరం లక్ష్మీ నారాయణ మూర్తులను చంద్రప్రభ వాహనం మీద ఊరేగింపు నిర్వహించారు.