తిరుపతి జిల్లా, పుత్తూరు పట్టణంలో శనివారం నాడు హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపాలని, ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ ను జైలు నుండి విముక్తి చేయాలని భారీ స్థాయిలో ర్యాలీ జరిపారు. బంగ్లాదేశ్ లోని హిందువులు మరియు ఇతర మైనారిటీలందరిపై ఇస్లామిక్ ఛాందసవాదులు మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు, దహనాలు మరియు అమానవీయ దౌర్జన్యాలు అత్యంత ఆందోళనకరమైనవని ముక్త కంఠంతో ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు.