నిండ్ర మండలం ఎలకాటూరు సచివాలయం పరిధిలోని ఆయకట్టుదారుల (చెరువు కట్ట కింద పంట చేసే రైతులు) ఎన్నికలను నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్ శేషగిరిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.ఎలకాటూరు ఎం.పి.యు.పి. స్కూల్ ఆవరణంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆయకట్టుదారులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.