వైసిపి కుటుంబ సభ్యులకు మరియు ప్రజలకు అండగా ఉంటామని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా నగరికి చెందిన గుణశేఖర్ నియామకం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నగరి లోని రోజా కార్యాలయంలో గురువారం జరిగిన (పుత్తూరు) మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ నాయకుడి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.