ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని నగిరి నియోజకవర్గం నిండ్ర ఎమ్మార్వో తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం నిండ్ర మండలం చవరంబాకం గ్రామపంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.