నగరి నియోజక వర్గం, నిండ్ర మండలం అత్తూరు గ్రామంలో గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని నాయకులతో పలు అంశాల గురించి చర్చించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.