పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలో గురువారం ఎంఆర్పిఎస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పి జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఎంఎస్పి జాతీయ నాయకులు నరేంద్రబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ , రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి మురళి మాట్లాడుతూ ఈనెల 21న చిత్తూరుకు జిల్లా కు వస్తున్న వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజిన్ మిస్రాకు 59 ఉప కులాల వారు వినతిపత్రం అందించాలని పిలుపునిచ్చారు.