పుత్తూరులో సిపిఐ జెండా ఆవిష్కరణ
పుత్తూరు పట్టణం ఎంబి రోడ్డు సర్కిల్ నందు సిపిఐ పార్టీ జెండా సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి. మహేష్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీని డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో కాన్పూర్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.