నగిరి: నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరం
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని పశు వైద్య శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు పశు వైద్య శాఖ అధికారుల సూచనలను పాటిస్తే అధిక పాల దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది , పాడి రైతులు పాల్గొన్నారు.