నగిరి: నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా నగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నగిరి లో శుక్రవారం మాట్లాడుతూ నియోజకవర్గంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా అధికారుల సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు.